తెలంగాణ

telangana

ETV Bharat / state

2020 ఏడాదిని ఫ్లోరెన్స్​ నైటింగేల్​కు గుర్తుగా.. - స్టార్​ ఆస్పత్రి తాజా వార్త

2020 నర్సింగ్​ ఏడాదిని పురస్కరించుకుని హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని స్టార్​ ఆస్పత్రి నర్సులు క్యాండిల్​ ర్యాలీ నిర్వహించారు.

star-hospital-workers-raly-in-hyderabad
2020 ఏడాదిని ఫ్లోరెన్స్​ నైటింగేల్​కు గుర్తుగా..

By

Published : Jan 7, 2020, 9:22 AM IST

2020 ఏడాదిని నర్సింగ్ సంవత్సరంగా జరుపుకుంటూ హైదరబాద్​ బంజారాహిల్స్​లోని స్టార్ ఆస్పత్రి నర్సులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ వృత్తిలో పేరుగాంచిన ఫ్లోరెన్స్ నైటింగేల్ 200 జయంతిని పురస్కరించుకొని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏడాదిని నర్సింగ్ సంవత్సరంగా పరిగణిస్తోందని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. ప్రజలకు చికిత్స అందించటంతో డాక్టర్ల తర్వాత నర్సులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని డాక్టర్లు అభిప్రాయపడ్డారు. నర్సులు వైద్య వ్యవస్థకు వెన్నెముఖ లాంటి వారని, వారికి తగిన గౌరవం ఇవ్వాలని వారు కోరారు. మరింత మందిని నర్సింగ్ వృత్తిలోకి వచ్చే విధంగా చేయాలని వారు కోరారు.

2020 ఏడాదిని ఫ్లోరెన్స్​ నైటింగేల్​కు గుర్తుగా..

ABOUT THE AUTHOR

...view details