హైదరాబాద్‌లో స్థిరాస్తి క్రయవిక్రయాలు గడిచిన ఆరు నెలల్లో స్తబ్దుగా ఉన్నట్లు నైట్‌ప్రాంక్ సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు దేశ వ్యాప్తంగా స్థిరాస్థి వ్యాపార స్థితిగతులపై ఓ నివేదికను ఆ సంస్థ హైదరాబాద్‌లో విడుదల చేసింది. దేశంలో స్థిరాస్తి క్రయవిక్రయాలు పెరిగినట్లు తెలిపింది. నిర్మాణ ప్రారంభోత్సవాల్లో తీసుకుంటే... దేశంలో అత్యధికంగా కోలకత్తాలో 90శాతం పెరుగుదలతో మొదటి స్థానంలో ఉండగా హైదరాబాద్ 47శాతంతో రెండో స్థానంలో ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.
వాణిజ్యంలో హైదరాబాద్ ఫస్ట్