తెలంగాణ

telangana

ETV Bharat / state

Minister Srinivas Goud:క్రీడల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట... త్వరలోనే క్రీడా పాలసీ - హైదరాబాద్​ జిల్లా వార్తలు

క్రీడల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. త్వరలోనే క్రీడా పాలసీని తీసుకువచ్చి... క్రీడాకారులను మరింత ప్రోత్సహిస్తామని తెలిపారు. హైదరాబాద్​లోని తన క్యాంప్ కార్యాలయంలో.. అంతర్జాతీయ స్విమ్మింగ్ క్రీడాకారిణి గోలి శ్యామలను మంత్రి అభినందించారు. గోలి శ్యామల ప్రపంచంలోని సప్త సముద్రాలను ఈది... రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రతిష్ఠలు తీసుకొచ్చారని కొనియాడారు.

swimmer Goli Shyamala
swimmer Goli Shyamala

By

Published : Oct 18, 2021, 7:16 PM IST

అంతర్జాతీయ స్విమ్మింగ్ క్రీడాకారిణి గోలి శ్యామలను క్రీడా, అబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అభినందించారు. గోలి శ్యామల ప్రపంచంలోని సప్త సముద్రాలను ఈది... రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రతిష్ఠలు తీసుకొచ్చారని కొనియాడారు. ఎంతో ప్రమాదకరమైన కేటాలినా ఐలాండ్ నుండి లాస్ ఏంజెల్స్ వరకు సుమారు 36 కిలోమీటర్లు స్విమ్మింగ్ చేసిన తొలి తెలుగు మహిళగా చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు. గతంలో భారత్​- శ్రీలంక దేశాల మధ్య ఉన్న పాక్ జల సంధిని ఈదిన రెండో మహిళ గోలి శ్యామల అని కొనియాడారు. అంతర్జాతీయ స్థాయి వేదికలపై రాణించి రాష్ట్రానికి, దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావడం సంతోషంగా ఉందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. త్వరలోనే క్రీడా పాలసీని తీసుకొచ్చి... క్రీడాకారులను మరింత ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, గోలి శ్యామల భర్త మోహన్, రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ కోశాధికారి ఉమేశ్​ పాల్గొన్నారు.

గోలి శ్యామల ప్రపంచంలోని సప్త సముద్రాలను ఈది... రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రతిష్ఠలు తీసుకొచ్చారు. ఎంతో ప్రమాదకరమైన కేటాలినా ఐలాండ్ నుండి లాస్ ఏంజెల్స్ వరకు సుమారు 36 కిలోమీటర్లు స్విమ్మింగ్ చేసిన తొలి తెలుగు మహిళగా శ్యామల చరిత్ర సృష్టించడం సంతోషంగా ఉంది. గతంలో భారత్​- శ్రీలంక దేశాల మధ్య ఉన్న పాక్ జల సంధిని ఈదిన రెండో మహిళ సైతం గోలి శ్యామల నిలిచారు. క్రీడల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు. త్వరలోనే క్రీడా పాలసీని తీసుకువచ్చి... క్రీడాకారులను మరింత ప్రోత్సహిస్తాం.

-శ్రీనివాస్ గౌడ్, క్రీడా శాఖ మంత్రి

ఇదీ చదవండి:Revanth Interesting Comments: హరీశ్‌రావును ఇంటికి పంపేందుకు కేసీఆర్‌ ప్రణాళిక: రేవంత్‌

ABOUT THE AUTHOR

...view details