కరోనా రెండో దశ ప్రభావంతో.. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం నిరాడంబరంగా జరిగింది. అర్చకులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. రాములోరి కల్యాణాన్ని నిర్వహించారు.
ముషీరాబాద్‌లో నిరాడంబరంగా సీతారాముల కల్యాణం - కరోనా రెండో దశ
ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో సీతారాముల కల్యాణ మహోత్సవం నిరాడంబరంగా జరిగింది. కొన్ని చోట్ల వేడుకలకు భక్తులను ఆలయాల్లోకి అనుమతించకపోవడంతో.. వారు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు.
ముషీరాబాద్‌లో రామనవమి
గాంధీనగర్, రామ్ నగర్, అడిక్మెట్, కవాడిగూడ, భోలక్‌పూర్ డివిజన్లలోని పలు ఆలయాల్లో.. వేద పండితులు కొవిడ్ నియమాలకు అనుగుణంగా కల్యాణాన్ని జరిపారు. చిక్కడపల్లి వివేక్ నగర్‌లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో.. కేవలం బ్రాహ్మణులు, పాలక మండలి, పరిమిత సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. భక్తులను ఆలయాల్లోకి అనుమతించకపోవడంతో.. వారు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు.