తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ పోలీసుల కవాతు - police kawath

హైదరాబాద్​లోని బోరబండ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ ప్రజలంతా నిర్భయంగా ఓటేయాలని పోలీసులు కోరారు.

నగరంలో పోలీసుల కవాతు

By

Published : Mar 29, 2019, 1:12 PM IST

నగరంలో పోలీసుల కవాతు
హైదరాబాద్​లోని బోరబండ, ఎస్సార్​ నగర్​, మోతీ నగర్​ పరిసర ప్రాంతాల్లో సెంట్రల్​ పారామిలటరీ బలగాలతో కలిసి స్థానిక పోలీసులు కవాతు నిర్వహించారు. ఓటుహక్కుపై అవగాహన కల్పించేందుకు ఎస్సార్​నగర్​ పోలీసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

ముఖ్య అతిథిగా పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న పాల్గొన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు నిర్భయంగా ఓటేయాలని సూచించారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా కవాతు నిర్వహించినట్లు ఎస్సార్​నగర్​ సీఐ​ మురళీకృష్ణ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details