కొవిడ్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి సికింద్రాబాద్కు చెందిన ఓ మహిళా ఉపాధ్యాయురాలు వినూత్న ప్రచారం చేస్తున్నారు. తన ఇంటినే ప్రచార కేంద్రంగా చేసుకుని పనికి రాని వస్తువులతో బొమ్మలను చేసి.. వాటితో బొమ్మల కొలువును నెలకొల్పింది ఈ ఉపాధ్యాయురాలు. 78 ఏళ్ల వృద్ధురాలు తన వయసును కూడా లెక్కచేయకుండా ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.
కరోనా బొమ్మల కొలువు అదేంటో చూద్దామా...! - Latest news in Telangana
కవితకు కాదేది అనర్హం అని శ్రీశ్రీ అంటే... హస్త కళలకు కాదేది అనర్హం అంటున్నారు తారాబాయి. సికింద్రాబాద్కు సీతాఫల్ మండికి చెందిన ఈ తారాబాయి వయసు 78 సంవత్సరాలు.. అయినప్పటికీ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు... ప్రతి ఏడాది ఏదో ఒక అంశంపై బొమ్మల కొలువు పెడుతోంది. అలాగే ఈసారి కరోనా బొమ్మల కొలువు పెట్టింది. అదేంటో చూద్దామా...!
సికింద్రాబాద్ సీతాఫల్మండి నివాసం ఉండే తారాబాయి వయసు 78. కానీ గత 64 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక అంశంపై ప్రజల్లో చైతన్యం, అవగాహన తీసుకురావడానికి తన ఇంటినే కేంద్రంగా చేసుకుని బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తుంది.
అందులో భాగంగా ఈ సంవత్సరం ప్రపంచాన్నిపట్టి పీడిస్తున్న కొవిడ్ మహమ్మారి గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కంకణం కట్టుకున్నట్లు తారబాయి తెలిపారు. కరోనా బారినపడిన తర్వాత ప్రజలు ఆసుపత్రికి వెళ్లడం.. అక్కడ చేసే పరీక్షలు, చికిత్స విధానంతో పాటు వార్తా ప్రసారాలు ఎలా జరుగుతాయి అనే విషయాలను కూడా సూచిస్తూ.. బొమ్మలను పెట్టారు.
- ఇదీ చూడండిఆ దేశ ప్రధానిపై రూ.900కోట్ల దావా