తెలంగాణ

telangana

ETV Bharat / state

పాలకమండళ్లు లేనిచోట ప్రత్యేకాధికారుల నియామకం

పాలకమండళ్ల పదవీకాలం పూర్తవుతున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. ఎన్నికలు జరగనందున ఆలోగా కొత్త పాలకమండళ్లు కొలువు తీరే అవకాశం లేదు.

http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/12-March-2021/10985608_govt.jpg
http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/12-March-2021/10985608_govt.jpg

By

Published : Mar 12, 2021, 10:27 PM IST

పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట మున్సిపాలిటీకి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకమండళ్ల పదవీకాలం ఈ నెల 14తో ముగియనుంది. సిద్దిపేట మున్సిపాలిటీ పదవీకాలం వచ్చే నెల 15న ముగుస్తుంది. ఎన్నికలు జరగనందున ఆలోగా కొత్త పాలకమండళ్లు కొలువు తీరే అవకాశం లేదు. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాల్టీల బాధ్యతలు నిర్వర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది.

గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్, ఖమ్మం కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా ఖమ్మం పాలనాధికారిని నియమించింది. అచ్చంపేట మున్సిపాలిటీ ప్రత్యేకాధికారిగా నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్... సిద్దిపేట మున్సిపాలిటీ ప్రత్యేకాధికారిగా సిద్దిపేట జిల్లా కలెక్టర్​ను నియమించింది. ఆయా పాలకమండళ్ల పదవీకాలం పూర్తైనప్పటి నుంచి కొత్త పాలకమండళ్లు కొలువు తీరే వరకు ప్రత్యేకాధికారులు బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ మేరకు పురపాలకశాఖ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చూడండి:ప్రజల కష్టాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం: భట్టి

ABOUT THE AUTHOR

...view details