సికింద్రాబాద్‌లోని అంజయ్యనగర్‌లో ప్రతిష్ఠించిన గణనాథుడిని నిమజ్జనానికి తరలించారు. రంగురంగుల విద్యుత్ కాంతుల వెలుగులతో పూల అలంకరణలతో లంబోదరుడిని తరలించే వాహనాన్ని అలంకరించారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం విద్యుత్ దీపాల వెలుగులో తీన్మార్ చప్పుళ్ల మధ్య నృత్యాలతో విఘ్నేశుని ఊరేగింపు నిర్వహించారు. తాము గత ఐదేళ్ల నుంచి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నామని.. పెద్ద ఎత్తున గణపతి నవరాత్రులను చేపడుతున్నామని అంజయ్య నగర్ వాసులు తెలిపారు. చిన్నపెద్ద అందరూ నిమజ్జన ఉత్సవంలో పాల్గొని ఉత్సాహంగా చిందులేశారు.
వైభవంగా గణేశుని నిమజ్జన వేడుకలు - నిమజ్జనం
సికింద్రాబాద్‌లోని అంజయ్యనగర్‌లో ప్రతిష్ఠించిన విఘ్నేశుని నిమజ్జన ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. విద్యుత్ దీపకాంతులతో తీన్మార్ చప్పుళ్ల నడుమ గణేశుని వాహనం ముందు చిన్నపెద్దా ఉత్సాహంగా చిందులేశారు.
వైభవంగా గణేశుని నిమజ్జన వేడుకలు