తెలంగాణ

telangana

ETV Bharat / state

'వాల్టా చట్టాన్ని పునఃసమీక్షించాలి.. 'పోడు' కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి' - telangana news

తెలంగాణ జర్నలిస్టు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘పోడు భూముల సమస్యలపై విశ్రాంత న్యాయమూర్తి మధుసూదన్‌రెడ్డి, కేంద్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌, సీనియర్‌ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తిల సమక్షంలో బహిరంగ విచారణ’ ఏర్పాటు చేయగా పలువురు బాధిత రైతులు మాట్లాడారు.

special-courts-should-be-set-up-for-the-settlement-of-fallow-lands
special-courts-should-be-set-up-for-the-settlement-of-fallow-lands

By

Published : Aug 30, 2021, 10:49 AM IST

పోడు భూముల సమస్య పరిష్కారానికి వాల్టా చట్లాన్ని పునఃసమీక్షించాలని విశ్రాంత న్యాయమూర్తి మధుసూదన్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేసి సమస్యను తొందరగా పరిష్కరించేలా చూడాలన్నారు.

పట్టాలున్నా భూములు లాక్కుంటున్నారని, ప్రశ్నిస్తే పోలీసులు కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టా పొందినవారినీ సాగు చేసుకోకుండా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు.

తెరాసకు కాకుండా వేరే పార్టీకి ఓట్లు వేసినవారిపై కక్షసాధింపుగా వ్యవసాయం చేసుకోకుండా కంచెలు వేస్తున్నారని, హరితహారం పేరుతో పొలాల్లో మొక్కలు పెంచుతున్నారని, కందకాలు తీస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌ తెలిపారు. మానుకోట పట్టణ ప్రాంతంలో ఎమ్మెల్యే దౌర్జన్యంగా గిరిజనుల నుంచి భూముల్ని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

30 ఏళ్లుగా భూమి దున్నుతున్న మాకు ఇప్పటివరకు పట్టాలు ఇవ్వలేదని. ఖమ్మం జిల్లా రేగులపాడుకు చెందిన రైతు కాసర్ల వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పోడు భూమి కోసం అటవీ అధికారుల్ని ఎదిరించినందుకు పోలీసులు తనను అరెస్ట్‌ చేసి, చంటి బిడ్డతో వారం రోజులపాటు జైలు జీవితం గడిపేలా చేశారాని ఎల్లన్ననగర్‌కు చెందిన మౌనిక కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరాం, పోడు రైతులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:Venkaiah Naidu: మన మూలాలను తెలియజెప్పే సారథి ‘భాష’ : వెంకయ్య

ABOUT THE AUTHOR

...view details