తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా కట్టడికై.. మహంకాళి ఆలయంలో చండీ హోమం - తెలంగాణ న్యూస్ అప్​డేట్స్

సికింద్రాబాద్​ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో చండీ హోమం కార్యక్రమం నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు మహంకాళి ఆలయంలో ఈవో మనోహర్​ ఆధ్వర్యంలో వేద పండితులచే... చండీహోమం కార్యక్రమాన్ని చేపట్టారు.

puja
puja

By

Published : May 11, 2021, 5:09 PM IST

రెండవదశ కరోనా కేసులో విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు ప్రాణాలు కోల్పోతూ.. ఆసుపత్రుల పాలవుతూ... అష్టకష్టాలు పడుతున్న నేపథ్యంలో సికింద్రాబాద్​ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో చండీ హోమం కార్యక్రమం నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు మహంకాళి ఆలయంలో ఈవో మనోహర్​ ఆధ్వర్యంలో వేద పండితులచే... చండీహోమం కార్యక్రమాన్ని చేపట్టారు.

ప్రజలు కరోనా బారిన పడకుండా... వైరస్​ వ్యాప్తి జరగకుండా మహమ్మారి అంతరించి పోవాలని ఆకాంక్షించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పెద్ద ఎత్తున అమ్మవారికి చండీ హోమం కార్యక్రమం చేపట్టారు.

ఇదీ చూడండి: తెలంగాణలో వచ్చే 10 రోజుల పాటు లాక్​డౌన్​

ABOUT THE AUTHOR

...view details