శాసనసభ, మండలి ఆర్థిక కమిటీలకు ఛైర్మన్లు - pocharam'
శాసనసభ, మండలికి సంబంధించిన వివిధ కమిటీల ఛైర్మన్ల పేర్లను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
శాసనసభ, మండలి ఆర్థిక కమిటీల ఛైర్మన్ల పేర్లను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కమిటీలో ఎన్నిక కోసం చేపట్టిన ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడం వల్ల పేర్లను వెల్లడించారు. ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్గా మజ్లిస్ శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, అంచనాల కమిటీ ఛైర్మన్గా సోలిపేట రామలింగారెడ్డి, ప్రభుత్వ రంగ సంస్థల సమితి ఛైర్మన్గా ఆశన్నగారి జీవన్ రెడ్డిని నియమించారు. మూడు కమిటీలకు శాసనసభ నుంచి తొమ్మిది మంది, మండలి నుంచి ముగ్గురు చొప్పున ఎన్నికయ్యారు.
ఇదీచూడండి:హుజూర్నగర్ ఉపఎన్నికల్లో కోదండరాం మద్దతు కోరిన ఉత్తమ్