తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రతా ప్రమాణాలకు ప్రాధాన్యతనివ్వాలి: గజానన్​ మాల్య

రైళ్ల రాకపోకలు, భద్రతా ప్రమాణాలు, సరకు రవాణా, సమయపాలనపై సికింద్రాబాద్‌లోని రైల్‌ నియంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్​ గజానన్‌ మాల్య వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. పని ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలను పాటించడానికి ప్రాధాన్యతనివ్వాలన్నారు.

భద్రతా ప్రమాణాలకు ప్రాధాన్యతనివ్వాలి: గజానన్​ మాల్య
భద్రతా ప్రమాణాలకు ప్రాధాన్యతనివ్వాలి: గజానన్​ మాల్య

By

Published : Nov 2, 2020, 10:23 PM IST

పని ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలను పాటించడానికి ప్రాధాన్యతనివ్వాలని.. రెండు వారాల పాటు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించాలని అధికారులకు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్​ గజానన్‌ మాల్య సూచించారు. రైళ్ల రాకపోకలు, భద్రతా ప్రమాణాలు, సరకు రవాణా, సమయపాలనపై సికింద్రాబాద్‌లోని రైల్‌ నియంలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

డ్రైవ్​ పూర్తయిన మీదట ఆయా ప్రాంతాల్లో రైల్వే భద్రతపై యాక్షన్‌ ప్లాన్‌ను సమర్పించాలని స్పష్టం చేశారు. జోన్‌లో అన్ని శిక్షణా సంస్థలు, స్టేషన్లు, కార్యాయాలతో సహా ప్రతీ ఒక్కరూ కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కొవిడ్ సూచనలను కచ్చితంగా పాటించాని జీఎం సూచించారు.

ఇదీ చదవండి:వినియోగదారులతో దక్షిణ మధ్య రైల్వే జీఎం వీడియో కాన్ఫరెన్స్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details