తెలంగాణ

telangana

ETV Bharat / state

Special Trains: జర్నీ ప్లాన్​ చేసుకోండి... ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు - జులై 6 వరకు ప్రత్యేక రైళ్ల గడువు పెంపు

ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్ల (Special Trains) సర్వీసును దక్షిణమధ్య రైల్వే పొడిగించింది. 24 ప్రత్యేక రైళ్ల సర్వీసులను ఈ నెల 26 నుంచి జులై 6 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.

special trains to july 6th
special trains to july 6th

By

Published : Jun 23, 2021, 9:14 PM IST

ప్రయాణికులు సౌకర్యార్థం 24 ప్రత్యేక రైళ్ల (Special Trains) సర్వీసును ఈ నెల 26 నుంచి జులై 6 వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. రోజు నడిచే విశాఖపట్నం- లింగంపల్లి, లింగంపల్లి - విశాఖపట్నం, విశాఖపట్నం -కడప, కడప- విశాఖపట్నం ప్రత్యేక రైళ్ల (Special Trains) సర్వీసులు పొడిగిస్తున్నామని ఎస్‌సీఆర్ అధికారులు పేర్కొన్నారు.

భువనేశ్వర్- తిరుపతి, తిరుపతి-భువనేశ్వర్‌, భువనేశ్వర్- చెన్నై సెంట్రల్‌, చెన్నైయ్‌ సెంట్రల్‌ - భువనేశ్వర్‌, భువనేశ్వర్‌- బెంగళూరు, భువనేశ్వర్‌-పాండిచ్చేరి వీక్లీ ప్రత్యేక రైళ్లను జులై 6వరకు పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. అదే విధంగా విశాఖపట్నం- హజ్రత్‌ నిజాముద్దీన్ బైవీక్లీ నడిచే ప్రత్యేక రైళ్లను కూడా పొడిగించినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:SCHOOLS RE OPEN: 'పాఠశాలల ప్రారంభంపై మార్గదర్శకాలు రూపొందించండి'

ABOUT THE AUTHOR

...view details