Ganja gang arrested in Cyberabad 910 kg seized : హైదరాబాద్లోని సైబరాబాద్ పరిధిలోని గంజాయిని అక్రమంగా తరలిస్తున్న 3 అంతర్రాష్ట్ర ముఠాలను ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితులు గంజాయిని ఏవోబీ నుంచి మహారాష్ట్రకు సరఫరా చేస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మొదట బాలానగర్ జోన్ పరిధిలో తనిఖీలు చేపట్టిన పోలీసులు 758 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు డీసీఎం వాహనంలో తౌడు బస్తాల మధ్య గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శంషాబాద్ పరిధిలో గంజాయి సరఫరా చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
- 'పుష్ప' సీన్ రిపీట్.. 'తగ్గేదే లే' అంటూ గంజాయి స్మగ్లింగ్.. ట్విస్ట్ అదుర్స్..!
- అపార్ట్మెంట్లో గంజాయి పెంచుతున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్.. యూట్యూబ్లో నేర్చుకుని మరీ..
నిందితుల నుంచి 144 కిలోల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చందానగర్ పీఎస్ పరిధిలో గంజాయి సరఫరా చేస్తున్న మరో ముఠాను అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 8 కిలోల గంజాయి, చరవాణి స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు. మొత్తం సైబరాబాద్ పరిధిలో 3 ముఠాల నుంచి 910 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్వోటీ పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.2.80 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. మొత్తం ఈ కేసులో 8 మందిని అరెస్టు చేశారు.
Ganjai gang arrested in Cyberabad : గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న వాటిని తరలించే నిందితుల ఆగడాలు ఏ మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి తక్కువ ధరకు గంజాయిని తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నారు. కొందరు హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని ఇక్కడి నుంచి పక్కరాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నిర్వాహకం చూసి పోలీసులే ఆశ్చర్యానికి లోనయ్యారు.