రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్ కుమార్ ప్రారంభించిన మూడో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో సినీ నటుడు సోనూసూద్ పాల్గొన్నారు. దర్శకుడు శీనువైట్ల ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన సోనూ..రామోజీ ఫిలిం సిటీలో మొక్కలు నాటారు.
రామోజీ ఫిలింసిటీలో మొక్కలు నాటిన రియల్ హీరో సోనూసూద్... - Film star sonu sood
కరోనా కాలంలో వేలాది మంది వలస కూలీలను ఆదుకున్న రీల్ కమ్ రియల్ హీరో సోనూసూద్ టాలీవుడ్ దర్శకుడు ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించారు. రామోజీ ఫిలిం సిటీలో మొక్కలు నాటి.. హరిత సవాల్ ఆలోచనకు శ్రీకారం చుట్టిన ఎంపీ సంతోశ్ కుమార్‌కు అభినందనలు తెలిపారు.
రామోజీ ఫిలింసిటీలో రియల్ హీరో సోనూ సూద్
లాక్డౌన్ తర్వాత పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత పెరిగిందన్న సోనూ.. చెట్లు నాటడం ప్రతిఒక్కరి బాధ్యత అని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో లక్షలాది మంది ఈ సవాల్‌ను స్వీకరిస్తూ మొక్కలు నాటాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని సోనూ పిలుపునిచ్చారు.