గాంధీభవన్లో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 73వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించాయి. పలు చోట్ల సోనియా చిత్రపటానికి పూలమాలలు వేసి దేశానికి, రాష్ట్రానికి ఆమె అందించిన సేవలను కొనియాడారు. ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చిన మహానేత సోనియాగాంధీ అని ఆయన అభివర్ణించారు.
గాంధీభవన్లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు - aicc pricedent sonia gandhi birthday celebrations
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 73వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరాడంబరంగా నిర్వహించాయి. గాంధీ భవన్‌లో పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్, ప్రేమలాల్ తదితరులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు.
గాంధీభవన్లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు