అమెరికాలో వివిధ రంగాల్లో రాణిస్తున్న ఏడుగురు మహిళల జీవిత గాథలతో 'హర్ టూల్ బాక్స్' పుస్తకాన్ని ఇషా రాసింది. కంపెనీలో చిన్నస్థాయి నుంచి సీఈవో స్థాయికి ఎదిగిన మహిళతో పాటు వివిధ రంగాల్లో పనిచేస్తున్నవారితో ముఖాముఖి నిర్వహించి స్ఫూర్తి కలిగించే అంశాలను రచనలో పొందుపరిచింది. ఇషా తండ్రి యు.సుహాస్ అమెరికాలోని అంబులెన్స్ సర్వీసెస్ సంస్థలో సీఈవో కాగా, తల్లి మధురిమ ఓ ఆసుపత్రికి ఛైర్మన్. తాతయ్య డా.సుబ్బారావు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థి సేవా విభాగాధిపతిగా గతంలో పనిచేశారు.
ఆలోచన అలా మొదలై..
కార్లను శుభ్రంచేసే సంస్థతోపాటు, బేక్‌సేల్స్ కంపెనీని సోదరి రియాతో కలిసి ఇషా ప్రారంభించింది. నిధులను సేకరించి సమాజ సేవకు వినియోగిస్తోంది. ఆన్‌లైన్ విద్యకు దూరంగా ఉన్నవారికి ఐపాడ్‌లను ఇస్తోంది. 'గర్ల్ ఫ్రాంటియర్' సంస్థను ఏర్పాటుచేసి పేద కుటుంబాల బాలికలకు విద్యను అందిస్తోంది. పారిశ్రామికవేత్తలుగా రాణించాలనుకునే యువతులకు నైపుణ్యాలనూ నేర్పిస్తోంది.