తెలంగాణ

telangana

ETV Bharat / state

కనీస వేతనాల కోసం సోషల్​ ఆడిట్​ ఉద్యోగుల ధర్నా - రాష్ట్ర సోషల్​ ఆడిట్​ ఎంప్లాయిస్​ జేఏసీ ఛైర్మన్​ తిరుపతి

తమ సమస్యలు పరిష్కరించాలని ట్యాంక్​బండ్​ వద్ద ఉన్న గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని సోషల్​ ఆడిట్​ ఉద్యోగులు చుట్టుముట్టారు. చట్టప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

కనీస వేతనాలు ఇవ్వండి

By

Published : Aug 30, 2019, 7:53 PM IST


హైదరాబాద్​ ట్యాంక్​బండ్​లోని గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని సోషల్​ ఆడిట్​ ఉద్యోగులు ముట్టడించారు. ఉద్యోగులకు చట్టప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని అసోసియేషన్​ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంజయ్య డిమాండ్​ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించారు. అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదన్నారు. సుధీర్ఘ కాలంగా పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల సంస్థ యజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర సోషల్​ ఆడిట్​ ఎంప్లాయిస్​ జేఏసీ ఛైర్మన్​ తిరుపతి ఆరోపించారు.

కనీస వేతనాలు ఇవ్వండి

ABOUT THE AUTHOR

...view details