ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదలకరోనా వల్ల ఇప్పటివరకు ఆరుగురు మరణించినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు, గ్లోబల్ ఆసుపత్రిలో ఒకరు, నిజామాబాద్లో ఒకరు, గద్వాలలో ఒకరు, అపోలో ఆసుపత్రిలో ఒకరు చనిపోయినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీరి ద్వారా వైరస్ వ్యాప్తికి అవకాశాలున్న అనుమానితులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో అనుమానితులను ప్రత్యేక బృందాలు ఆసుపత్రులకు తరలిస్తున్నాయి.
తెలంగాణలో ఆరుకు చేరిన కరోనా మృతుల సంఖ్య - తెలంగాణలో ఆరుకు చేరిన కరోనా మృతుల సంఖ్య
కరోనా కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు ఆరు మరణాలు నమోదయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఈ నెల 13 నుంచి 15 వరకు దిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందకిరి కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. కరోనా పాజిటివ్ అని తేలిన వారిలో రాష్ట్రానికి చెందిన వారు కూడా ఉన్నారు. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరు విధిగా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఆరోగ్య శాఖ చెప్పిన వివరాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 57 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి.
ఇవీ చూడండి: మానవత్వమే చిన్నబోయింది... చివరికి ఆత్మహత్యాయత్నం చేసింది!
TAGGED:
corona telangana