సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామికవాడలోని అమెజాన్ గిడ్డంగిలో జరిగిన చరవాణిల చోరీ కేసులో ఆరుగురు సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెజాన్ ఆర్డర్‌పై వినియోగదారునికి అందించేందుకు గిడ్డంగికి వచ్చిన ఎనిమిది చరవాణిలు 2 రోజుల క్రితం చోరీకి గురయ్యాయి. గిడ్డంగి సెక్యూరిటీ సూపర్వైజర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది, నలుగురు కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అమెజాన్ గిడ్డంగి చోరీ కేసులో ఆరుగురి అరెస్ట్ - అమెజాన్ గిడ్డంగి చోరిలో ఆరుగురు సిబ్బంది అరెస్టు
అమెజాన్ గిడ్డంగిలో జరిగిన ఖరీదైన చరవాణిల చోరీ కేసులో పోలీసులు ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు సెక్యూరిటీ, నలుగురు కార్మికులను విచారిస్తున్నారు.
SIX EMPLOYEES ARRESTED IN AMAZON WAREHOUSE THEFT CASE IN PATANCHERU
TAGGED:
chori