DE Ramesh investigation in TSPSC case : టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నిందితుడిగా ఉన్న డీఈ రమేశ్‌ను సిట్ అధికారులు రెండో రోజు ప్రశ్నించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ సహా హైటెక్ మాస్ కాపీయింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. డీఏఓ, ఏఈఈ పరీక్షల్లో హైటెక్ మాస్ కాపీయింగ్‌కి పాల్పడిన రమేశ్ దాదాపు 7 మంది అభ్యర్థులకు జవాబులను అందించాడు. అందుకోసం ముందే పరీక్షా కేంద్రం నిర్వాహకుడిని బుట్టలోకి దింపాడు.
టోలిచౌకీలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న అలీతో పరిచయం పెంచుకొని ప్రశ్నాపత్రం తెప్పించుకున్నాడు. ఆ తర్వాత వాటికి సమాధానాలను అభ్యర్థులకు చెప్పాడు. అందుకోసం బ్లూటూత్ పరికరాలను అభ్యర్థులకు ముందే సమకూర్చాడు. ఒక్కో అభ్యర్థితో రూ.30లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఆ తర్వాత టీఎస్పీఎస్సీ మాజీ ఉద్యోగి సురేశ్‌తో ఉన్న పరిచయం ఆధారంగా ఏఈ ప్రశ్నాపత్రాన్ని తీసుకున్నాడు.
- TSPSC Paper Leak Updates : వీళ్లు మామూలోళ్లు కాదు బాబోయ్.. మాస్ కాపీయింగ్ కోసం ఏకంగా..!
- TSPSC PAPER LEAKAGE CASE UPDATE : ఎగ్జామ్‌లో టాపర్.. ప్రశ్న అడిగితే నో మేటర్
వాటిని దాదాపు 80మందికి విక్రయించినట్లు సిట్ అనుమానిస్తోంది.అందుకు సంబంధించిన వివరాలను సిట్ అధికారులు రమేశ్ వద్ద ప్రస్తావించి సమాచారం సేకరిస్తున్నారు. మరో 4 రోజులపాటు డీఈ రమేష్ కస్టడీ ఉండటంతో అతన్ని ప్రశ్నించి పూర్తిస్థాయిలో సమాచారం సేకరించాలని సిట్ అధికారులు భావిస్తున్నారు.