SIT Investigation 5th Day In TSPSC Paper Leakage: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులను సిట్ ఐదో రోజు ప్రశ్నిస్తోంది. ఈ విచారణలో టీఎస్పీఎస్సీకి కొత్త కొత్త నిజాలు తెలుస్తున్నాయి. నిందితుల నుంచి మంగళవారం కీలక సమాచారం రాబట్టిన సిట్ అధికారులు.. నేడు కూడా అదే రీతిలో కొత్త విషయాలు తెలుసుకున్నారు.
టీఎస్పీఎస్సీ కమిషన్‌లోని దాదాపు 40 మంది సిబ్బందికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ కమిషన్‌లోని మొత్తం 10 మంది ఉద్యోగులు పరీక్ష రాసినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. అయితే గ్రూప్-1 పరీక్ష రాసిన ఉద్యోగులతో పాటు మిగిలిన వాళ్లకు కూడా నోటీసులు అందించారు. ఈ గ్రూప్-1 పేపర్ లీకేజీతో నిందితులు బాగానే లబ్ధి పొందినట్లు సిట్ బృందం అనుమానం వ్యక్తం చేస్తోంది.
కోచింగ్ సెంటర్ నిర్వాహకులకు, అభ్యర్థులకూ నోటీసులు?:నిందితులు ఎవరేవరికి కాల్స్ చేశారనే కోణంలో దర్యాప్తు చేసిన సిట్ అధికారులకు.. రేణుక, ఢాక్యానాయక్‌లు పలువురు పోటీ పరీక్షల అభ్యర్థులతో పాటు.. కోచింగ్ సెంటర్ల నిర్వాహకులతో మాట్లాడినట్లు అనుమానిస్తున్నారు. అయితే రేణుకా కాల్ డేటా ఆధారంగా అభ్యర్థులతో పాటు కోచింగ్ సెంటర్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చే ఆలోచనలో సిట్ అధికారులు ఉన్నట్లు సమాచారం.
Sit Notices For 40 Employees Of TSPSC Commission: ఈ గ్రూప్-1 పేపర్ లీకేజీ ఫలించిన తర్వాతనే.. ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి ఇతర పేపర్లను లీక్ చేసినట్లు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. పేపర్ లీకేజీలో అన్నింటి కన్నా ఏఈ ప్రశ్నపత్రం లీక్‌తోనే భారీగానే లబ్ధిపొందినట్లు ఆధారాలు సేకరించారు. ఈ విధంగా నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తుంటే.. కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయని సిట్ అధికారులు తెలుపుతున్నట్లు సమాచారం.
TSPSC Paper Leakage: అయితే ప్రశ్నపత్రం లీకేజీ కేసులో అరెస్టు చేసిన 9 మంది నిందితులకు 6రోజుల కస్టడీలో భాగంగా సిట్ ఐదో రోజు విచారణను కొనసాగిస్తోంది. ఈ విచారణలో భాగంగా ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి బ్యాంకు ఖాతాలను సిట్ బృందం పరిశీలిస్తోంది. అలాగే ఈ కేసులో నిందితులుగా పేర్కొంటున్న రేణుక, ఢాక్యా నాయక్ దంపతుల బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలించినట్లు తెలుస్తోంది. అయితే గత కొంతకాలంగా జరిగిన లావాదేవీలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.
మంగళవారం కాన్ఫిడెన్షియల్ సెక్షన్ సూపరెంటెండెంట్ అధికారిని శంకరలక్ష్మి సైతం విచారించి.. ఆమె వద్ద నుంచి కొన్ని వివరాలు సేకరించారు. ఆమె చెప్పిన సమాచారం ప్రకారం ఐదో రోజు ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇంకా లోతుగా విచారణ సాగించడానికి టీఎస్పీఎస్సీలో మరికొంత మంది సిబ్బందికి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: