Singareni Election Results 2023 : ఏడాదిన్నర కాలంగా ఎదురుచూస్తున్నసింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు(Singareni Elections 2023) బుధవారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో సింగరేణిలో ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా అవతరించింది. ఆరేళ్లుగా అధికారిక గుర్తింపు సంఘంగా ఉన్న తెబొగసం ప్రభావం కోల్పోయింది. ఐఎన్‌టీయూసీ ప్రాతినిధ్య సంఘంగా సత్తాచాటింది. దక్షిణ భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి చేసే ఏకైక ప్రభుత్వ సంస్థ సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
Telangana Singareni Election Results 2023 :సంస్థలో 2017-ఎన్నికల్లో కేవలం రెండు డివిజన్లలో ప్రాతినిధ్య సంఘంగా ఉన్న సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ ఇప్పుడు ఐదు డివిజన్లలో గెలవడమే కాకుండా, ఎక్కువ ఓట్లు సాధించి గుర్తింపు సంఘంగా నిలిచింది. ఆ ఎన్నికల్లో పోటీలో లేనికాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీ ఇప్పుడు ఆరు చోట్ల గెలిచి ప్రాతినిధ్య హోదా దక్కించుకుంది. అప్పట్లో 9 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ ఇప్పుడు నామమాత్ర ప్రభావానికే పరిమితమైంది.
మొత్తంగా సింగేరేణి ఎన్నికల్లో 11 ఏరియాలు ఉండగా, ఐదు ఏరియాల్లో ఏఐటీయూసీ, ఆరుచోట్ల ఐఎన్‌టీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపొందాయి. బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది. రామగుండం రీజియన్‌లోని రామగుండం-1, 2 ఏరియాల్లో ఏఐటీయూసీ, రామగుండం-3లో ఐఎన్‌టీయూసీ విజయం సాధించింది.
సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తాం : మంత్రి శ్రీధర్ బాబు