సింగరేణిలోని అండర్ గ్రౌండ్ మెకనైజ్డు గనులైన అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు మరియు జీడీకే-11 ఇంక్లైన్, పీవీకే-5 ఇంక్లైన్, కొండాపురం, వకీల్‌పల్లి గనుల్లోని కంటిన్యూయస్ మైనర్స్ బొగ్గు ఉత్పత్తిపై ప్రత్యేకంగా సమీక్షించారు. అడ్రియాలలో నిర్దేశిత 2 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాల సాధనలో ఎదురవుతున్న ఇబ్బందులు, అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎండీ దిశానిర్దేశం చేశారు.
ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు అడ్రియాలలో ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోలేదని, రానున్న 7 నెలల కాలంలో పుంజుకొని ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని ఆదేశిచారు. యంత్రాల బ్రేక్ డౌన్ కారణంగా ఉత్పత్తికి విఘాతం కలుగుతోందని,దాని తగ్గించే ప్రయత్నం చేయాలని యంత్రాల పనిగంటలను సైతం పెంచాలని..అందుకు కావలసిన విడి పరికరాలు, పంపులను సకాలంలో సమకూర్చుకోవాలని ఆదేశించారు.