తెలంగాణ

telangana

ETV Bharat / state

సిద్ధార్థ ఎంతో మందికి ఆదర్శం: కిషన్​రెడ్డి - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

7వ తరగతిలోనే సాఫ్ట్​వేర్​ ఉద్యోగం సంపాదించిన సిద్ధార్థపై ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా సిద్ధార్థ గురించి తెలుసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చిన్నారిని తన నివాసానికి ఆహ్వానించి అభినందించారు.

సిద్ధార్థ ఎంతో మందికి ఆదర్శం: కిషన్​రెడ్డి

By

Published : Nov 2, 2019, 11:29 PM IST

హైదరాబాద్​కు చెందిన సిద్ధార్థ అనే 12 సంవత్సరాల చిన్నారి ఏడో తరగతిలోనే సాఫ్ట్​వేర్ ఉద్యోగం సంపాదించాడు. మాదాపూర్​లోని ఓ ఐటీ కంపెనీలో డాటా సైంటిస్ట్​గా ఉద్యోగం సంపాదించిన సిద్ధార్థ పై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు సిద్ధార్థను అభినందించారు. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా సిద్ధార్థను ఆయన నివాసానికి ఆహ్వానించారు. 12 ఏళ్ల వయస్సులోనే ఐటీ రంగంలో అపార ప్రతిభ కనబరుస్తోన్న సిద్ధార్థను అభినందించారు. విద్యార్థి దశలోనే భవిష్యత్​ను అందంగా తీర్చిదిద్దుకుంటోన్న సిద్ధార్థ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని మంత్రి ప్రశంసించారు.

సిద్ధార్థ ఎంతో మందికి ఆదర్శం: కిషన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details