ఏపీ మంత్రి కొడాలి నానికి రాష్ట్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఎన్నికల కమిషన్ పరువు, ప్రతిష్ఠకు భంగం కలిగేలా మాట్లాడారంటూ నోటీసు ఇచ్చింది. ఈసీ ప్రతిష్ఠను దిగజార్చేలా దురుద్దేశ ప్రకటనలు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేసింది. మీడియా సమావేశంలో వ్యాఖ్యలపై తక్షణమే వివరణ ఇవ్వాలని కోరింది.
ఏపీ మంత్రి కొడాలి నానికి ఎస్ఈసీ షోకాజ్ నోటీస్
ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసు జారీచేసింది. ఎస్ఈసీని కించపరిచేలా మీడియా సమావేశంలో మాట్లాడారని అభ్యంతరం వ్యక్తం చేసింది. కొడాలి నాని తన వ్యాఖ్యలపై సాయంత్రం 5 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ మంత్రి కొడాలి నానికి ఎస్ఈసీ షోకాజ్ నోటీస్
ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు కొడాలి నాని బహిరంగ ప్రకటన చేయాలని... సాయంత్రం 5 గంటల్లోగా మంత్రి కానీ, ప్రతినిధి ద్వారా కానీ సమాధానం ఇవ్వాలని ఎస్ఈసీ రమేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చూడండి:రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఎవరైనా ఆలోచించారా? : కేటీఆర్