'పార్లమెంట్ పరిధి మెుత్తానికి సేవ కార్యక్రమాలు విస్తరించాలి' - AMBERPET
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అంబర్ పేటలో పర్యటించారు. స్వచ్ఛంద సంస్థ భరతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.
అంబర్‌పేటలోని లకోటియా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భరతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేశారు.
గత కొన్నేళ్లుగా భరతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ నిర్వహిస్తున్నారని కిషన్ రెడ్డి ప్రశంసించారు. ఫౌండేషన్ ప్రతినిధులకు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఇక ముందు కూడా వారి సేవలు ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజక వర్గాల పరిధిలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని భరతమాత ఫౌండేషన్‌కు విజ్ఞప్తి చేశారు. లకోటియా పాఠశాలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.