తెలంగాణ

telangana

ETV Bharat / state

చర్యకు  ప్రతిచర్య: సీఆర్​పీఎఫ్ - PEOPLES PLAZA

సీఆర్‌పీఎఫ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నెక్లెస్​ రోడ్‌లోని  జలవిహార్‌ నుంచి పీపుల్స్‌ ప్లాజా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. భద్రతా దళాల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం

By

Published : Feb 16, 2019, 6:04 AM IST

Updated : Feb 16, 2019, 12:06 PM IST

ఉగ్రదాడిని ఖండిస్తూ సీఆర్‌పీఎఫ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు
ఉగ్రదాడిని ఖండిస్తూ సీఆర్‌పీఎఫ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించారుపుల్వామాలో జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ సీఆర్‌పీఎఫ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్​ రోడ్‌లోని జలవిహార్‌ నుంచి పీపుల్స్‌ ప్లాజా వరకు సాగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో సీఆర్‌పీఎఫ్‌, ర్యాపిడ్‌ యాక్షన్‌ టీమ్‌ అధికారులు పాల్గొన్నారు. పుల్వామా ఘటన ఊహించని నష్టమని.. వీర జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామని సీఆర్‌పీఎఫ్‌ ఉన్నతాధికారులు తెలిపారు. దీనికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. దేశ ప్రజల నుంచి వచ్చిన మద్దతు తమలో మరింత స్ఫూర్తినిచ్చిందని స్పష్టం చేశారు.
Last Updated : Feb 16, 2019, 12:06 PM IST

ABOUT THE AUTHOR

...view details