హైదరాబాద్ వనస్థలిపురంలో సోమవారం ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ సినీ గేయ రచయిత శివగణేష్ సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శివగణేష్ చిత్రపటానికి నటుడు జడ్జి కృష్ణమూర్తి నివాళులర్పించారు. ఎఎం రత్నం, శంకర్, ఏఆర్ రహమాన్లతో చాలా చిత్రాలకు శివగణేష్ గీతాలను అందించడం అదృష్టమని నటుడు కృష్ణమూర్తి అన్నారు. ఆయన రచించిన గీతాలు ప్రజల మనస్సులో నిలిచిపోతాయని తెలిపారు.
గేయ రచయిత శివగణేష్కు సంస్మరణ నివాళులు - హైదరాబాద్
శివగణేష్ రాసిన పాటలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాయని సినీనటుడు జడ్జి కృష్ణమూర్తి పేర్కొన్నారు.
గేయ రచయిత శివగణేష్కు సంస్మరణ నివాళులు