తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన జయరాం హత్యకేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో కీలకంగా ఉన్న మృతుని మేనకోడలు శిఖాచౌదరిని... నేడు విచారణకు హాజరుకావాలని జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. హత్యకేసులో శిఖాచౌదరిపై ఆరోపణలు రాగా.. విచారణ అనంతరం.. ఏపీ పోలీసులు క్లీన్ చీట్ ఇచ్చారు. తరువాత జయరాం భార్య విజ్ఞప్తి మేరకు.. కేసును తెలంగాణ పోలీసులకు బదిలీ చేశారు.