తెలంగాణ

telangana

ETV Bharat / state

YS Sharmila Today Tweet : 'అమరవీరుల స్మారక చిహ్నం పూర్తి కావడానికి తొమ్మిదేళ్లు ఎందుకు పట్టిందో'

YS Sharmila Fires On CM KCR : త్యాగాల మీద, రక్తపు చుక్కలపై పీఠం ఎక్కిన దొర.. అమరుల కుటుంబాలను ఆదమరిచారని వైఎస్‌ షర్మిల ట్విటర్‌ వేదికగా ఆరోపించారు. రాష్ట్ర సాధనకై ప్రాణాలను పణంగా పెట్టిన వారు ఎందరో అయితే.. ఆ ఫలాలను అందరికీ దక్కకుండా చేసిన ఉద్యమ ద్రోహి కేసీఆర్ అని విమర్శించారు. ఎప్పుడూ లేని ప్రేమ ఉద్యమ అమరులపై ఎందుకు వచ్చిందో అని ఎద్దేవా చేశారు.

YS Sharmila
YS Sharmila

By

Published : Jun 22, 2023, 9:51 PM IST

YS Sharmila Fires On CM KCR On Twitter : రాష్ట్ర సాధనకై ప్రాణాలను పణంగా పెట్టిన వారు ఎందరో అయితే.. ఆ ఫలాలను అందరికీ దక్కకుండా చేసిన ఉద్యమ ద్రోహి కేసీఆర్ అని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలువైఎస్ షర్మిలమండిపడ్డారు. అసువులు బాసిన అమరుల ఆశయాలు గోదారి పాలైతే .. స్వరాష్ట్ర సంపద అంతా కేసీఆర్ పాలయ్యే అని ట్విటర్‌ వేదికగా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. నిధులు మింగే, నీళ్లు ఎత్తుకు పోయే, ఉద్యోగాలు ఇంట్లనే ఇచ్చుకునే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

త్యాగాల మీద, రక్తపు చుక్కలపై పీఠం ఎక్కిన దొర.. అమరుల కుటుంబాలను ఆదమరిచారని వైఎస్‌ షర్మిల ఆరోపించారు. ఇన్నాళ్లు వాళ్లెవరో అన్నట్లు, గుర్తుకు లేనట్లు నాటకాలు ఆడారన్నారు. సడెన్‌గా ఉన్నట్లుండి 9 ఏళ్లుగా లేని ప్రేమ ఎన్నికల వేల మళ్లీ పుట్టుకొచ్చే.. అమరుల ప్రాణత్యాగం వెలకట్టలేనిది అంటూ కుండపోతగా ప్రేమను కురిపించే పన్నాగం పన్నుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఓడిపోతామనే సంకేతాలతోనే అమరవీరులు మళ్లీ యాదికొచ్చారని ధ్వజమెత్తారు.

Telangana Martyrs Memorial Stupa : రాష్ట్ర సాధనకై 1500 మంది ప్రాణాలు కోల్పోతే.. వారి పేర్లు కూడా తెలుసుకోలేని సర్కారు ఇదని వైఎస్‌ షర్మిల విమర్శించారు. 1200 మంది అమరవీరులయ్యారని సొంత లెక్కలు బయటపెట్టిన కేసీఆర్.. ఆదుకున్నది 528 మందిని మాత్రమే అని, మిగిలిన 700 మంది అమరుల త్యాగాలను, చరిత్రను కేసీఆర్‌ చెరిపేసే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. ఇన్నాళ్లు గుర్తుకు రాని శంకరమ్మను పిలిచి ఎమ్మెల్సీ ఇస్తారట.. కొత్తగా అమరులకు న్యాయం చేస్తారట.. అని విరుచుకుపడ్డారు. ఉద్యమాన్ని అణగదొక్కిన ఉద్యమద్రోహులను అక్కున చేర్చుకొని.. తెలంగాణ తల్లికి ఆత్మఘోష రగిల్చిన మారీచుడు ఈ కేసీఆర్ అని వైఎస్ షర్మిల మండిపడ్డారు.

YS Sharmila Tweet On CM KCR : ఇల్లు, భూమి, ఉద్యోగం ఇస్తానని చెప్పి వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడు కేసీఆర్‌ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరుల పేర్లను సువర్ణాక్షరాలతో లిఖిస్తానని చెప్పి.. తన కుటుంబాన్ని బంగారం చేసుకున్నడే కానీ వారి పేర్లను ఎక్కడా చెక్కలే అని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిలో ప్రగతిభవన్‌ కోటలు కట్టుకున్న దొరకు.. అమరవీరుల స్మారక చిహ్నం పూర్తి కావడానికి మాత్రం తొమ్మిదేళ్లు ఎందుకు పట్టిందో అని ప్రశ్నించారు. తెలంగాణ సమాజం ఈ విషయం గ్రహించాలని సూచించారు. కేసీఆర్‌ లాంటి ఉద్యమద్రోహులు అమరవీరుల స్మారకాన్ని ఆవిష్కరించడం అంటే అమరవీరులను.. తెలంగాణ సమాజాన్ని అవమానించినట్లేనని వైఎస్‌ షర్మిల వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details