Sharmila fires on CM KCR: ప్రగతిభవన్ ముట్టడికి బయలుదేరిన తనను అరెస్టు చేయడంపై ట్విటర్ వేదికగా వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం కేసీఆర్ పిరికిపంద చర్యలకు బెదిరేది కాదు వైఎస్ఆర్ బిడ్డ అంటూ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని పాతరేసి.. అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు.
పిరికిపంద చర్యలకు బెదిరేది కాదు కేసీఆర్.. వైఎస్ఆర్ బిడ్డ : షర్మిల - కేసీఆర్‌పై షర్మిల ఫైర్
15:40 November 29
పిరికిపంద చర్యలకు బెదిరేది కాదు కేసీఆర్.. వైఎస్ఆర్ బిడ్డ : షర్మిల
పోలీసులను పనోళ్లలా వాడుకుంటూ... టీఆర్ఎస్ గుండాలను ఉసిగొల్పి దాడులకు పాల్పడితే ఖబడ్దార్ కేసీఆర్ అంటూ ఘాటుగా ట్విటర్లో పేర్కొన్నారు. ప్రగతిభవన్‌లో దాక్కున్నా.. ఫామ్ హౌజ్‌లో దాక్కున్నా నీ పతనం ఖాయమంటూ ట్విటర్ వేదికగా వైఎస్ షర్మిల మండిపడ్డారు.
అసలేం జరిగిందంటే..వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రగతి భవన్ ముట్టడి యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. నిన్న వైతెపా అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర చేస్తున్న క్రమంలో.. ప్రచారం రథంపై దాడి జరిగింది. ఈ దాడిలో కారు అద్దాలు పగిలిపోయాయి. ధ్వంసమైన కారులో షర్మిల ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ షర్మిల ప్రగతిభవన్ వైపు వెళ్తుండగా.. పంజాగుట్ట చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా రాజ్‌భవన్ రోడ్డులో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. పోలీసులు షర్మిలను అరెస్టు చేయడానికి ప్రయత్నించగా.. కారులోనే కూర్చుని ఉండిపోయారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే దాడులు చేస్తున్నారంటూ ఆరోపించారు. పోలీసులు షర్మిలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఎంతకీ ఆమె వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు సైతం చాలా ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ఆమెను కారులో నుంచి దించే ప్రయత్నం చేయగా.. కారు కిటికీలు మూసేసి ఎంతకూ బయటకు రాలేదు. ఈ క్రమంలో కారుపై కూర్చుని వైతెపా కార్యకర్తలు నిరసన తెలిపారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. 15 మందికి పైగా వైతెపా కార్యకర్తలు, నేతలను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. ధ్వంసమైన కారు డ్రైవింగ్ సీట్లో షర్మిల కూర్చొని ఉండగానే పోలీసుల క్రేన్‌ను తెప్పించి అక్కడి నుంచి ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆమెను కారులో నుంచి దించి స్టేషన్లోకి తీసుకెళ్లారు.
ఇవీ చదవండి: