రాష్ట్రంలో తహసీల్దార్, ఆర్డీఓ, జిల్లా రెవెన్యూ కోర్టులను రద్దు చేసి ఆ స్థానంలో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా ట్రైబ్యునళ్లు సేవలు ప్రారంభించాయి. ట్రైబ్యునల్‌లో సభ్యులైన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు... రోజూ రెండు మండలాల చొప్పున వివాదాల పరిష్కారానికి సమయం కేటాయిస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న భూవివాదాల్లోని యజమానులకు నోటీసులు ఇచ్చి తగిన ఆధారాలతో ట్రైబ్యునళ్లను ఆశ్రయించాల్సిందిగా సూచిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రారంభమైన జిల్లా ట్రైబ్యునళ్ల సేవలు
రాష్ట్రంలో తహసీల్దార్, ఆర్డీఓ, జిల్లా రెవెన్యూ కోర్టులను రద్దు చేసి ఆ స్థానంలో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా ట్రైబ్యునళ్లు సేవలు ప్రారంభించాయి.
రాష్ట్రంలో ప్రారంభమైన జిల్లా ట్రైబ్యునళ్ల సేవలు
వివాదాల పరిష్కారానికి ట్రైబ్యునళ్లకు ప్రభుత్వం నెలరోజుల గడువు ఇచ్చింది. మరోవైపు ధరణి పోర్టల్ వేగం పుంజుకుంది. రిజిస్ట్రేషన్లు పూర్తయి మ్యుటేషన్లు కాని భూఖాతాల సమస్యలను పరిష్కరించేందుకు... సర్కారు వారం రోజుల సమయమిచ్చింది. ఇందులో భాగంగా పోర్టల్‌లో ఐచ్ఛికాలు ఇవ్వడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున దరఖాస్తులు నమోదవుతున్నాయి.
ఇదీ చదవండి:కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీపై హైకోర్టులో విచారణ