కొవిడ్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న పరిస్థితుల్లో కుంభమేలా నిర్వహించాల్సిన అవసరం ఉందా అని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. దీనికి కారణమైన ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యానాథ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోదీ, అమిత్‌షాలకు అధికార అహం ఎక్కువైందని ఆరోపించారు.
'ప్రధాని మోదీ, యూపీ సీఎంలపై చర్యలు తీసుకోవాలి'
కరోనాతో జనం విలవిల్లాడుతుంటే పట్టించుకోకుండా కేంద్రం ఎన్నికలు నిర్వహించడం ఏమిటని ... కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. కుంభమేళా నిర్వహణకు కారణమైన ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యానాథ్లపై చర్యలు తీసుకోవాలన్నారు.
కేంద్రంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్
కరోనాతో జనం విలవిల్లాడుతుంటే పట్టించుకోకుండా ఎన్నికలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. కొవిడ్ తీవ్రత అధికంగా ఉందని భావించి రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రతి తెల్ల రేషన్ కార్డుదారునికి.. ఆరు వేల రూపాయలు లబ్ది చేకూర్చాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో రెమ్‌డెసివిర్ ఉత్పత్తి.. ఇతర రాష్ట్రాలకు తరలింపు!