తెలంగాణ

telangana

ETV Bharat / state

టీఆర్​ఎస్​లో బాహాబాహీ... డివిజన్ అధ్యక్ష పదవి కోసం వాగ్వాదం - ముషీరాబాద్ నియోజకవర్గం

ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్ టీఆర్​ఎస్ డివిజన్ అధ్యక్ష పదవి కోసం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశం రసాభాసగా మారింది.

రసాభాసగా మారిన డివిజన్ అధ్యక్షుడి ఎంపిక సమావేశం

By

Published : Aug 26, 2019, 5:06 PM IST

రసాభాసగా మారిన డివిజన్ అధ్యక్షుడి ఎంపిక సమావేశం

ముషీరాబాద్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ శ్రేణులు గొడవకు దిగారు. నియోజకవర్గంలోని రాంనగర్ డివిజన్ అధ్యక్ష పదవి కోసం ఎమ్మెల్యే, కార్పొరేటర్ల అనుచరులు వర్గాలుగా విడిపోయి... వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్​లోని యూనియన్ కార్యాలయంలో డివిజన్ అధ్యక్ష ఎన్నికల సమావేశంలో ఎమ్మెల్యే ముఠాగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే, కార్పొరేటర్ వర్గాలుగా ఏర్పడి తమకు అనుకూలమైన వ్యక్తికే డివిజన్ అధ్యక్ష పదవిని కేటాయించాలని పరస్పరం నినాదాలు చేశారు. దీంతో సమావేశం నుంచి ఎమ్మెల్యే వెళ్లిపోయారు. డివిజన్ అధ్యక్షునిగా మల్లేష్​ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు స్థానికులు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details