తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి జులై 3 వరకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా 32వ అంతర్జాతీయ విత్తన సదస్సు నిర్వహిస్తోంది. హైటెక్స్‌లో ఉదయం 9 గంటలకు జరగబోయే ప్రారంభోత్సవ సదస్సుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకావాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులకు వ్యవసాయశాఖ ఆహ్వానాలు పంపించింది.
తెలంగాణ రాష్ట్రాన్ని సీడ్ బౌల్‌గా చూడాలన్న ఆశయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఐదేళ్లలో అనేక వినూత్న నిర్ణయాలు తీసుకుని దేశంలోనే తెలంగాణను విత్తనకేంద్రంగా నిలిపారని మంత్రి నిరంజన్ కొనియాడారు. ఇస్టా కాంగ్రెస్ సదస్సుతో తెలంగాణ ఖ్యాతి అంతర్జాతీయంగా వెలుగొందడం ఖాయమన్నారు.