నిబంధనలకు వ్యతిరేఖంగా డ్రోన్ కెమెరా వాడినట్లయితే ఫెనాల్టీతో సరిపెట్టాల్సింది పోయి కఠినమైన సెక్షన్లు ఏలా పెడతారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ఇవాళ గాంధీ భవన్‌లో సమావేశమైన కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై చర్చించారు. మండలి మాజీ విపక్ష నేత షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే సీతక్క, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, మాజీ ఎంపీలు మల్లు రవి, రాజయ్య, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సురేష్ షట్కర్ తదితరులు సమావేశమయ్యారు.
'పబ్లిక్ లీడర్ ఇల్లు చూడొద్దా' - congress leader shabbir ali comments
సాధారణంగా అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా వాడినట్లైతే రూ. 200 జరిమానా వేస్తే సరిపోతుంది. కానీ జన్వాడ ఫాం హౌస్‌పై డ్రోన్ కెమెరా వాడినందుకు ఎంపీతో సహా ఆరు మందిని ఎలా అరెస్టు చేస్తారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. పబ్లిక్ లీడర్ ఇల్లు చూడొద్దా అని అన్నారు. తాజా బడ్జెట్ కాగితాలకే పరిమితమని ఆరోపించారు. గత బడ్జెట్లలో ఏది కూడా 100 శాతం ఖర్చుచేయలేదన్నారు.
ఫాంహౌస్ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణం చేస్తే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని షబ్బీర్ అలీ అన్నారు. ఇల్లు చూసేందుకు వెళితే ఆరెస్టులు చేయాల్సిన పని ఏంటని నిలదీశారు. ఫాంహౌస్ గురించి ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఆ మంత్రికి లేదా అని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు వచ్చిన తరువాత ఈ విషయంపై చర్చించి కార్యాచరణ రూపొందించుకుని ప్రజల్లోకి వెళతామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మ్యాజిక్ ఫిగర్‌లా ఉందని తెలిపారు. యువతకు ఏ మాత్రం కేటాయింపులు లేవన్నారు.
ఇదీ చూడండి :తెలంగాణ పద్దు... కేటాయింపులు ఎవరెవరికి ఎలా అంటే?