రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం బుధవారం ప్రారంభం కానుంది. రేపు ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమం పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు.
6 వేల కోట్ల రూపాయలు మంజూరు
ఆయా జిల్లాల్లో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు నేతృత్వంలో లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ ప్రక్రియ ప్రారంభించనున్నారు. రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 3.81 లక్షల మంది గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్లు ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇందుకోసం ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ 6 వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. అంతేకాకుండా పెరిగిన ధరలు, లబ్ధిదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గొర్రెల యూనిట్ ధర గతంలో 1.25 లక్షల రూపాయలు ఉండగా... ఇప్పుడు ఆ యూనిట్ ధర 1.75 లక్షల రూపాయల వరకు పెంచేందుకు కూడా సీఎం ఆమోదం తెలిపారు. 8,109 సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న 7,61,898 మంది గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మొదటి విడతలో 3,76, 223 యూనిట్ల గొర్రెలు పంపిణీ