ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్‌ఎల్) హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో కొనసాగుతోంది. అత్యంత వేగంగా దూసుకుపోతున్న కార్లు.. ప్రేక్షకుల కేరింతలతో ఆ పరిసరాల్లో సందడి నెలకొంది. రెండో రోజు రేసింగ్ ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచే సందర్శకులను గ్యాలరీల్లోకి అనుమతించారు.
నేటి షెడ్యూల్ ఇదే..
- ఉదయం 9 గంటలకు ఫార్ములా-4 క్వాలిఫైయింగ్ రేస్
- 9.20గంటలకు ఇండియన్ రేసింగ్ లీగ్ క్వాలిఫైయింగ్ 1
- 9.40గంటలకు ఇండియన్ రేసింగ్ లీగ్ క్వాలిఫైయింగ్ 2
- 10.15గంటలకు ఫార్ములా 4లో రేస్ 1 స్టార్ట్
- 11.10 గంటలకు ఇండియన్ రేసింగ్ లీగ్‌లో రేస్-1
- మధ్యాహ్నం 12 గంటలకు ఫార్ములా 4లో రేస్ -2
- మధ్యాహ్నం 1.35 గంటలకు ఫార్ములా 4లో రేస్ -3
- మ. 2.30 కి ఇండియన్ రేసింగ్ లీగ్‌లో రేస్ 2
- మధ్యాహ్నం 3.50కు ఇండియన్ రేసింగ్ లీగ్‌లో రేస్-3 స్టార్ట్
ఐఆర్‌ఎల్ నిన్న అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇండియన్ రేసింగ్ లీగ్‌లో 12 కార్లు, 6 జట్లు, 24 మంది డ్రైవర్లు పాల్గొంటున్నారు. రహదారి అభివృద్ధి, ఇతర మౌలిక వసతులకు హెచ్‌ఎండీఏ రూ.90 కోట్ల వరకు వెచ్చించింది.