తెలంగాణ

telangana

ETV Bharat / state

'పోలింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యేలా చర్యలు తీసుకుంటాం'

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి తెలిపారు. వివిధ సంఘాలతో కూడిన ఎలక్షన్ వాచ్ బృందంతో పార్థసారధి సమావేశయ్యారు.

'పోలింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యేలా చర్యలు తీసుకుంటాం'
'పోలింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యేలా చర్యలు తీసుకుంటాం'

By

Published : Sep 23, 2020, 10:29 PM IST

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి తెలిపారు. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేని వారి కోసం ఈ- ఓటింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు పరిశీలిస్తున్నామని... ఇందుకోసం అవసరమైన సాఫ్ట్​వేర్ రూపొందిస్తామని చెప్పారు. వివిధ సంఘాలతో కూడిన ఎలక్షన్ వాచ్ బృందంతో ఎస్ఈసీ పార్థసారధి సమావేశయ్యారు.

2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.29 శాతం పోలింగ్ మాత్రమే నమోదైందని... దాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఆయనన్నారు. ఇందుకోసం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడతామని పార్థసారధి పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా పౌరసంఘాలను సమన్వయం చేసేందుకు ప్రత్యేకంగా లైజన్ అధికారిని కూడా నియమిస్తామని తెలిపారు.

కొవిడ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిబంధనలు రూపొందిస్తున్నట్లు ఎస్ఈసీ వివరించారు. ఓటర్లు తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదా చూసుకోవడం సహా అన్ని అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. కాలనీ సంక్షేమ సంఘాలను భాగస్వామ్యుల్ని చేస్తామని పార్థసారధి తెలిపారు.

ఇదీ చూడండి: ఉమెన్ చాందీని ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

ABOUT THE AUTHOR

...view details