తెలంగాణ

telangana

ETV Bharat / state

గెలిచిన అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీలపై నిషేధం: ఎస్‌ఈసీ - SEC ban on victory rallies of winning candidates

ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీలపై ఎస్‌ఈసీ నిషేధం విధించింది. కౌంటింగ్ హాల్, బయట జనసమూహాలు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. కౌంటింగ్ ప్రక్రియలో కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

state election commission on municipal elections
గెలిచిన అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీలపై నిషేధం: ఎస్‌ఈసీ

By

Published : May 3, 2021, 1:47 PM IST

మున్సిపాల్టీ, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీలపై నిషేధం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. కౌంటింగ్ హాల్ వద్ద, బయట జనసమూహాలు ఏర్పడకుండా చర్యలు తీసుకున్నామని... కౌంటింగ్ ప్రక్రియలో కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొంది. కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి కలెక్టర్ ఆధ్వర్యంలో కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది.

గెలిచిన అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీలపై నిషేధం: ఎస్‌ఈసీ

మొత్తం 6,559 మందికి పరీక్షలు చేయగా.. 308 మందికి పాజిటివ్‌గా తేలిందని వారి స్థానంలో వేరే వారిని కౌంటింగ్ సిబ్బందిగా నియమించినట్లు వెల్లడించింది. ప్రతి కౌంటింగ్ సెంటర్ వద్ద వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. నిన్న కౌంటింగ్ హాళ్లను శానిటైజ్ చేసిన తర్వాత మెడికల్ నోడల్ ఆఫీసర్ ద్వారా ధ్రువీకరణ పొందినట్లు పేర్కొంది. కౌంటింగ్​లో పాల్గొనే ప్రతి ఒక్కరు మాస్క్ ధరించేలా చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details