కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. నిత్యం ఆరు నుంచి ఏడు వందల మంది వైరస్ బారిన పడుతున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇదే సమయంలో రాష్ట్రం ముసురేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులకు జ్వరంతో వచ్చే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వర్షాకాలంలో డెంగీ, మలేరియా కేసులు సర్వసాధారణమే అయినా... ఇటీవల డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు.
ఉస్మానియాకు పెరుగుతున్న భారం
ఒక్క ఫీవర్ ఆస్పత్రిలోనే 102 మంది డెంగీ బాధితులు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలిపి సుమారు ఐదు వందల వరకు డెంగీ కేసులు నమోదైనట్లు చెబుుతున్నారు. మలేరియా కేసులు కూడా ఎక్కువగానే ఉన్నట్టు తెలిస్తోంది. ఇటీవల తీవ్ర జ్వరంతో ఉస్మానియా ఆస్పత్రికి వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. ఉస్మానియాకి సాధారణంగా వెయ్యి నుంచి 1200 వరకు ఓపీ ఉంటుంది.. అయితే ఇటీవల మాత్రం ఆ సంఖ్య 1800 వరకు పెరిగినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అటు గాంధీలో సాధారణ వైద్య సేవలు అందుబాటులో లేకపోవటం... అంతకంతకీ సీజనల్ వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ఉస్మానియాపై భారం పెరుగుతోంది. ఫలితంగా కులీ కుతుబ్ షాహీ భవంతిలో అదనంగా 300 పడకలు ఏర్పాటు చేసినా... అవీ చాలని పరిస్థితి నెలకొందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
దోమల వల్లే వ్యాధులు...