మట్టి వినాయక విగ్రహాలు వాడి పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ... మన్నెగూడకు చెందిన శ్లోక ఇంటర్నేషనల్ పాఠశాల విద్యార్థులు వాహనదారులకు అవగాహన కల్పించారు. హైదరాబాద్లోని హస్తినాపురం కూడలిలో ప్లకార్డులు చేతపట్టుకొని పువ్వు, మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా పంచారు. పర్యావరణాన్ని కాపాడితేనే మనుగడ ఉంటుందంటూ వాహనదారులందరికీ అవగాహన కల్పించారు. ప్రస్తుత జీవన విధానంలో సవాలుగా మారిన రసాయనాలు, ప్లాస్టిక్ వంటి వాటిపై చిన్న పిల్లలతో చెప్పిస్తేనైనా ప్రజలు మారుతారనే నమ్మకంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పాఠశాల యాజమాన్యం చెప్పింది.
మట్టి గణపతే మానవాళికి ఆధారం - మట్టి గణపతి
వారంతా చిన్న పిల్లలు. అందంగా నవ్వుతూ దగ్గరకొచ్చి ఒక పువ్వు, మట్టి గణపతి ప్రతిమను ఇస్తూ... ముద్దు ముద్దుగా పర్యావరణాన్ని కాపాడండి అని చెప్తున్నారు.
మట్టి గణపతే మానవాళికి ఆధారం