కరోనా కష్టకాలంలోనూ సింగరేణి సంస్థ ఉత్పత్తి లక్ష్యాలలో దూసుకుపోతోంది. జులై నెలలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి 47.56 లక్షలు కాగా.. సింగరేణి సంస్థ 102.34 శాతంతో 48.67 లక్షల ఉత్పత్తిని సాధించింది. జులైలో నిర్దేశిత బొగ్గు రవాణా లక్ష్యం 45.56 లక్షల టన్నులు కాగా దీనిని అధిగమించి 110.39 శాతంతో 50.29 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసిందని సింగరేణి సంస్థ ప్రకటించింది.
గత ఆర్థిక సంవత్సరం జులైలో సాధించిన బొగ్గు ఉత్పత్తి 28.5 లక్షల టన్నులతో పోలిస్తే ఏడాది జులైలో 70.65 శాతం వృద్ధిని సాధించింది. అలాగే బొగ్గు రవాణాలో గత జులై నెలలో సాధించిన 29.1 లక్షల టన్నులతో పోలిస్తే ఈ ఏడాది 72.9 శాతం వృద్ధిని సాధించింది. కాగా గత ఏడాది జులైలో 477 రేకుల ద్యారా బొగ్గు రవాణా చేసిన సింగరేణి ఈ ఏడాది 91.6 శాతం వృద్ధితో 914 రేకుల ద్యారా బొగ్గు రవాణా చేసింది. ఓవర్ బర్డెను తొలగింపులో కూడా సింగరేణి గణనీయమైన వృద్ధిని నమోదుచేసింది.