హైదరాబాద్ చాదర్ఘాట్ పీఎస్ పరిధిలోని కమలానగర్లో అత్యాచారయత్నానికి గురైన బాలిక కుటుంబాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రాములు పరామర్శించారు. మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కమిషన్ సభ్యుడు రాములు తెలిపారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బలాలపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు.
పాతబస్తీలో మజ్లిస్ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. ఇష్టారాజ్యంగా కబ్జాలు, పేదలపై దాడులు చేస్తున్నా పోలీసులు చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. బాలిక కుటుంబానికి నష్టపరిహారం వచ్ఛే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
'ఎమ్మెల్యే బలాలపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి' - malakpet mla balala
మలక్పేట్ ఎమ్మెల్యే తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రాములు తెలిపారు. ఆయనపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు.
'ఎమ్మెల్యే బలాలపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి'