Sbi Women's Day Celebrations: సంతోషకరమైన, ఆరోగ్యకరమైన జీవితం కోసం ప్రతి మహిళ తమ అభిరుచులను పెంపొందించుకొని, కొనసాగించాలని ఎస్బీఐ సీజీఎం సతీమణి, ఎస్బీఐ లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు నుపుర్ జింగ్రాన్ మహిళలకు సూచించారు. హైదరాబాద్ కోటిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. ఎస్బీఐ సీజీఎం అమిత్ జంగ్రాన్‌తోపాటు పలువురు ఎస్బీఐ అధికారులు పాల్గొన్నఈ కార్యక్రమంలో వివిధ రంగాలల్లో రాణించిన, విజయం సాధించిన మహిళలను ఎస్బీఐ తరఫున ఘనంగా సన్మానించారు.
Sbi Women's Day Celebrations: ఎస్బీఐ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు - హైదరాబాద్ ఎస్బీఐలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు తాజా వార్తలు
Sbi Women's Day Celebrations: హైదరాబాద్ కోఠిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ సీజీఎం అమిత్ జింగ్రాన్ ఆయన సతీమణి నుపుర్ జింగ్రాన్ పాల్గొన్నారు.

హైదరాబాద్ ఎస్బీఐలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు
మహిళా ఉద్యోగులకు సురక్షితమైన పని వాతావరణాన్నిఅందించేందుకు ఎస్బీఐ అనేక చర్యలు తీసుకున్నట్లు బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ స్పష్టం చేశారు. ఎస్బీఐలో మహిళా ఉద్యోగులు 30శాతం వరకు ఉన్నారన్నజింగ్రాన్ సవాళ్లతో కూడిన ఎన్నో బాధ్యతలను స్వీకరించి...సమర్థవంతంగా పని చేసిన, చేస్తున్న మహిళ అధికారులను, ఉద్యోగులను ఆయన అభినందించారు.
కోఠి ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు
ఇదీ చదవండి: వైభవంగా మహిళా దినోత్సవ సంబురాలు