తెలంగాణ

telangana

ETV Bharat / state

Bharatyatha Programme In USA : భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు.. అమెరికాలో భారతీయత కార్యక్రమం

Satsankalpa Foundation In USA : భారతీయత పేరుతో యూఎస్​ఏకు చెందిన సత్సంకల్ప ఫౌండేషన్​ భారతీయ సనాతన, సంస్కృతిని కాపాడే పనిలో నిమగ్నమై.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అందులో భాగంగా ఈ సంస్థను ఏర్పాటు చేసి.. భారతీయ సనాతనను కాపాడే వారిని గౌరవించారు. భారతీయులకు సత్సంకల్ప ఫౌండేషన్​ శివానంద స్మృతి పురస్కారంతో సత్కరించారు.

BHARATYATHA
BHARATYATHA

By

Published : Jun 25, 2023, 7:30 PM IST

Satsankalpa Foundation Bharatyatha Programme : భారతీయత పేరుతో సత్సంకల్ప ఫౌండేషన్​ వారు ప్రథమ వార్షికోత్సవం జూన్​10న యూఎస్​ఎలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత్​, అమెరికా, కెనడా దేశాల నుంచి పలువురు విచ్చేశారు. 350 మంది వార్షికోత్సవంలో పాల్గొనగా.. మరికొంత మంది సామాజిక మాధ్యమాల ద్వారా వీక్షించారు. సత్సంకల్ప కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య ఉద్దేశ్యం ప్రవాస భారతీయులకు భారతదేశ సనాతన సంప్రదాయాల ఔన్నత్వాన్ని చాటి చెప్పడమే.

సత్సంకల్ప ఫౌండేషన్

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత దౌత్య కార్యాలయంలో కౌన్సిల్​ పబ్లిక్​ డిప్లమసీ & కల్చర్​ విభాగానికి చెందిన విపుల్​ దేవ్ వచ్చేశారు. కార్యక్రమంలో సద్గురు శివానంద గురువు చిత్ర పటం వద్ద జ్యోతిని వెలిగించి.. ప్రారంభించారు. సత్సంకల్ప ఫౌండేషన్​ అధ్యక్షులు, స్థాపకులు శ్రీధర తాళ్లపాక సభను ఉద్దేశించి ప్రసంగించారు. సందేశము, స్వీయ ధర్మ పరిశీలన ప్రతి ఒక్కరు చేసుకొనుట చాలా ముఖ్యమని.. అది సమాజానికి ఎంతో అవసరమని శ్రీధర తాళ్లపాక వివరించారు. అదే భారతీయత, మన సంస్కృతి అని తెలిపారు.

సత్సంకల్ప ఫౌండేషన్

Bharatyatha Programme In USA : అలాగే మానసిక ఆరోగ్యం కాపాడుకొనుట కొరకు సనాతన ధర్మములో గల చికిత్సా ప్రక్రియలను.. వాటి ప్రాచుర్యాన్ని షాలిని వివరించారు. దీనిని ఒక లఘు చిత్రం ద్వారా వర్ణించారు. అందులో ఆయుర్వేద, యోగ,హోమం ద్వారా మానసిక సంతులిక ఎలా పెంచుకోవచ్చునో చక్కగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సద్గురు శివానంద గురువు దివ్య చరితమును కూచిపూడి నృత్య నాటికగా రూపొందించి.. ప్రదర్శించారు. మొత్తం 40 మందికి ఈ ప్రదర్శనను గావించారు. అనంతరం శాఖాహార విందును ఏర్పాటు చేశారు.

సత్సంకల్ప ఫౌండేషన్ వారి భారతీయత కార్యక్రమం

Sivananda Memorial Awards By Satsankalpa Foundation : విదేశాలు వచ్చిన ఎన్నో ఉన్నతమైన పదవులను అనుభవించిన.. భారత సనాతన ధర్మాన్ని పాటిస్తూ.. ముందు తరాలకు వాటి విలువలు నేర్పుతున్న పలువురి భారతీయులకు సత్సంకల్ప ఫౌండేషన్​ శివానంద స్మృతి పురస్కారముతో సత్కరించి.. భరతమాత విగ్రహాన్ని బహుకరించారు.

  • రాజం కుమార్ : ఈ అవార్డులు రాజం కుమార్​ ఉన్నతమైన సంగీత ప్రాచుర్యమున్న కుటుంబంలో పుట్టి.. ఆ వారసత్వాన్ని కళలను ప్రపంచానికి అందిస్తున్నారు.
  • డాక్టర్​ చంద్రనారాయణన్ : అలాగే డాక్టర్​ చంద్రనారాయణన్​.. సుప్రసిద్ధ సర్జికల్​ అంకాలజిస్టు.. కొన్ని దశాబ్దాలుగా వారి సేవలను సమాజానికి అందిస్తున్నారు.
  • ప్రొ.​ కలయంపూడి రాధాకృష్ణారావు : ప్రముఖ గణిత శాస్త్రవేత్త.. పద్మ విభూషణ్​ ప్రొఫెసర్​ కలయంపూడి రాధాకృష్ణారావుకు గణాంకాల పరిధిలో అత్యుత్తమ రచనలు చేశారు.. అందుకుగానూ వారికి ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఈయన స్టాటిస్టిక్స్​ రంగంలో నోబెల్​ బహుమతితో సమానమైన ఇంటర్నేషనల్​ ప్రైజ్​ ఇన్​ స్టాటిస్టిక్స్​ పురస్కరాన్ని 2023 సంవత్సరానికి అందుకోనున్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details