హైదరాబాద్ సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే... కింగ్స్ సంస్థ ప్రతినిధుల సహకారంతో సీపీ మహేష్ భగవత్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
వలస కార్మికుల ఆకలి తీర్చిన పోలీసులు - food distribution
తినడానికి తిండిలేక ఇబ్బంది పడుతున్న 200 మంది వలస కూలీలకు హైదరాబాద్ సరూర్నగర్ పోలీసులు అండగా నిలిచారు. స్థానిక స్వచ్ఛంద సంస్థ సహకారంతో వారి ఆకలి తీర్చారు.
వలస కార్మికుల ఆకలి తీర్చిన పోలీసులు
ఆపద సమయంలో వలస కార్మికులకు అండగా నిలిచిన సంస్థ సేవా సంస్థ ప్రతినిధులను సీపీ అభినందించారు.