మొక్కల పెంపకాన్ని విరివిగా చేపట్టి వృక్షాలను రక్షించాలన్నారు ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్. హరితహారం కార్యక్రమాన్ని సీతాఫల్మండిలో లాంఛనంగా ప్రారంభించారు. సీతాఫల్మండిలోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ఎదుట మొక్కలను నాటారు. జన్మదినం వంటి సందర్భాల్లో మొక్కలను నాటే సంప్రదాయాన్ని పాటించాలన్నారు. ఈ సందర్భంగా జ్యూట్ బ్యాగులను ఆవిష్కరించిన పద్మారావు గౌడ్ అందరికి అందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సామల హేమ, అలకుంట సరస్వతి, నిర్వాహకుడు గరికపోగుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
'సీతాఫల్మండిలో మెుక్కలు నాటిన ఉపసభాపతి'
చెట్లు నాటడం ద్వారానే పర్యావరణాన్ని పరిరక్షించగలుగుతామని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గంతో పాటు జంటనగరాల్లో మొక్కల పెంపకాన్ని అందరూ చేపట్టాలని కోరారు.
ప్రకృతిని పరిరక్షించే మొక్కలను, చెట్లను పెద్ద సంఖ్యలో పెంపొందించాలి : పద్మారావు గౌడ్