Sankranti Celebrations in Police Station : సంక్రాంతి పండుగ రోజుల్లో పోలీసులకు కంటిమీద కునుకే ఉండదు. మద్యం తక్కువ ధరలో లభించే ఆంధ్రప్రదేశ్లోని యానాం వంటి ప్రాంతంలో అయితే మందుబాబులు తమ ఆగడాలతో పోలీసులకు చుక్కలు చూపిస్తుంటారు. ఇలాంటి సమయంలో కూడా ఆ పోలీస్ స్టేషన్ ఫిర్యాదుదారులతో కాకుండా పచ్చని తోరణాలు.. చెరుకు గడలు.. రంగురంగుల రంగవల్లులు.. పాల పొంగులతో కళకళలాడింది. కేంద్ర పాలిత ప్రాంతం యానాం పోలీస్స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివ గణేశ్ ఆధ్వర్యంలో తన సిబ్బందితో సంక్రాంతిని ఇంటి వద్ద కాకుండా స్టేషన్లో నిర్వహించి అందర్నీ అబ్బురపరిచారు.
పోలీస్స్టేషన్లో వైభవంగా సంక్రాంతి సంబురాలు
Sankranti Celebrations in Police Station : పోలీస్స్టేషన్ అనగానే ప్రతి రోజూ ఏదో గొడవలు.. తగాదాలు.. కొట్లాటలు.. సమస్యలతో వచ్చే ఫిర్యాదుదారులతో స్టేషన్ అంతా గందరగోళంగా ఉంటుంది. అందులోనూ పండుగ రోజుల్లో పోలీసులకు కంటిమీద కునుకే ఉండదు. కానీ ఏపీలోని యానాం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో సంక్రాంతిని ఇంటి వద్ద కాకుండా స్టేషన్లోనే నిర్వహించి అందర్నీ అబ్బురపరిచారు. ముగ్గుల పోటీలు నిర్వహించి.. విజేతలకు బహుమతులు కూడా అందజేశారు.
మహిళా కానిస్టేబుల్ స్టేషన్ ప్రాంగణమంతా సంప్రదాయ ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి అందంగా తీర్చిదిద్దారు. సంక్రాంతి పండుగ రోజు ప్రధానమైన పరమాన్నం తయారు చేయడం కోసం మట్టి కుండలో పాలుపోసి మూడు పొంగులు వచ్చిన తర్వాత బియ్యం.. బెల్లం.. వేసి పరమాన్నం తయారు చేశారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. పండుగను ప్రతి ఒక్కరు తమ కుటుంబాలతో ఇంటి వద్ద చేసుకుంటారని.. 24 గంటలు స్టేషన్ ఆవరణలోనే ఉంటాం కనుక ఇదే మా ఇల్లుగా భావించి ఇక్కడే సంక్రాంతి జరుపుకున్నామని సర్కిల్ ఇన్స్పెక్టర్ శివ గణేశ్ తెలిపారు.
ఇవీ చదవండి: